Monday, 28 July 2014

అష్టావక్రుడి కథ

అష్టావక్రుడి కథ విష్ణు పురాణంలో చెప్పబడింది అష్టావక్రుడి తల్లి తండ్రులు ఉద్దాలక మహర్షి చెల్లెలు అయిన  సుజాత
మరియ ఏకపాద మహర్షి.

ఏకపాద మహర్షు ల వారు చాల  శిష్యులకు  విద్యాభోధ చేస్తుండే వారు. ఐతే వారు బాగా విజ్ఞ్యన వంతులు  కావాలని  కొంచం  కటినంగా ఉండేవారు  మద్య మద్యలో శిక్షగా   వారిని విరామం లేకుండా  చదివిస్తూ ఉండేవారు.

ఒక రోజు ఏకపాదులు మరియు సుజాత  భోజనం చేసి మాట్లాడుకుంటుండగా సుజాత  గర్బస్త శిశువు ఏకపాదుడి తొ "మీరు శిష్యులను విరామం లేకుండా చదివిస్తున్నారు అందు వల్ల వారు అన్న పానీయాలు మరియు విశ్రాంతి లేక బాధ  పడ్తున్నారు " అని అన్నాడు అది విన్న ఏకపాదుడికి  కోపం వచ్చి "నాకే బుద్దులు చెప్తావా? నువ్వు అస్టవంకరలతొ  జన్మింతువు గాక" అని శపించాడు.
astavakrudu

ఆ రోజుల్లో వరుణ పుత్రుడు అయిన వంది అనే వాడు తనను శాస్త్ర వాదం లో గెలిచె వాడె లేదు అని విర్ర వీగుతూ ,తనను గెలిచిన వాడికి అపార ధన రాశులు ఇస్తా అని, ఓడి పొతే వాదించి ఓడి పోయిన పండితులను తన గృహం లో జల దిగ్బంధం లో ఉంచుతానని దండోరా వేయించాడు. అలా చాల మంది పండితులు ధనం కోసం ఆశపడి వంది -వరణుడి  గృహంలో జల బందీలుగా అయ్యారు .

ఇది విన్న ఎకపాదుడు వందిని ఓడించి ధనం  తెచ్చుకోవాలని  వెళ్లి, వాదంలో ఓడిపోయాడు  దానితో వంది అతన్ని కూడా జలదిగ్బoదం  లో పడ వేసాడు. ఆశ్రమం లో సుజాత అష్టావక్రుడికి  జన్మనిచ్చిoది. మేన మామ ఉద్దాలకుడినే తన తండ్రిగా బావించేవాడు అష్టావక్రుడు. ఉద్దాలకుడికి ఒక కుమారుడుండె వాడు అతడి పేరు అశ్వకేతు .

అశ్వకేతు ఒక రోజు చిన్న తనం వళ్ళ తెలీక , తన తండ్రి ఉద్దాలకుడి వాళ్ళో కూర్చున్న అష్టావక్రుడిని తోసేసి "మా నాన్న ఒళ్ళో ఎందుకు కూర్చున్నావ్-పోయి మీ  నాన్న వళ్ళో కూర్చోపో" అని అన్నాడు. అష్టావక్రుడు ఏడుస్తూ వెళ్లి తన తల్లిని అమ్మ " నాకు నాన్న ఎవరు అని అడిగాడు. అపుడు సుజాత  ఎకపాదుడు-వంది వృత్తాంతం వివరించింది.

అప్పుడు  అష్టావక్రుడు జనక రాజు సభ కు వెళ్లి వంది ని ఓడించాడు. వంది సిగ్గుతో చితికి పోయి అపార మైన ధనముతో పటు ఇంకా నీకు ఏమ్కవలో కోరుకో అని అడగగా , జలదిగ్బంనదంలో  ఉన్న తన తండ్రి తో పాటు అందర్నీ విడిచి పెట్టమని కోరి , తన తండ్రి తో ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. 

0 comments:

Post a Comment